High Court | హైదరాబాద్, జనవరి 31 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పార్టీ మారాలనుకొనే ప్రజాప్రతినిధులు ముందుగా తమ పదవికి రాజీనామా చేయాలని కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీనామా అనంతరం తిరిగి నిర్వహించే ఎన్నికల్లో గెలిచి చూపించాలని సూచించింది. అప్పుడే ప్రజాస్వామ్య నైతికతకు సరైన అర్థమని వ్యాఖ్యానించింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏమిటీ కేసు?
కేరళలోని కూతట్టుకులం నగర మునిసిపల్ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి ప్రవేశపెట్టింది. అయితే అధికార ఎల్డీఎఫ్ కూటమికి చెందిన కాలా రాజు అనే మహిళా కౌన్సిలర్ ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తుందన్న అనుమానంతో సొంతపార్టీకి చెందిన నేతలే ఆమెను కిడ్నాప్ చేశారు. ఇదే సమయంలో తమ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ కూడా ఛైర్మన్‌కు అనుకూలంగా ఓటేయవచ్చన్న అనుమానంతో విపక్ష పార్టీ యూడీఎఫ్ కార్యకర్తలు కూడా ఆమెను అపహరించారు. ఈ క్రమంలో వాళ్లు అరెస్టయ్యారు. దీనిపై విచారించిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ నిందితులకు బెయిల్‌ను మంజూరు చేసింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు ఇవి