సీతాఫలంపైనా ఎల్ నినో ఎఫెక్ట్!
సీజనల్ ఫ్రూట్‌గా అందరికీ అందుబాటులో ఉండే సీతాఫలం.. ఈసారి సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నది. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలు సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూత దశలోనే పిందెలు రాలిపోతున్నాయి.
- పెరిగిన ఉష్ణోగ్రతలతో చెట్టుపైనే మాడిపోతున్న పిందెలు
- తగ్గనున్న దిగుబడి.. ధరలు పెరిగే అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : సీజనల్ ఫ్రూట్‌గా అందరికీ అందుబాటులో ఉండే సీతాఫలం.. ఈసారి సామాన్యులకు అందనంత దూరం వెళ్తున్నది. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, మరోవైపు పెరిగిన ఉష్ణోగ్రతలు సీతాఫలాల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పూత దశలోనే పిందెలు రాలిపోతున్నాయి. కాసిన కాయలు కూడా పూర్తిస్థాయిలో ఎదగడం లేదని ఉద్యానశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీతాఫలాల చెట్లు ఉన్నప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా మాత్రం వీటికి పెట్టింది పేరు. జిల్లాలో గుట్టలు, బంజరుభూములు, అటవీ ప్రాంతాలు విస్తారంగా ఉండడమే ఇందుకు ప్రధానకారణం. బాలాపూర్ సీతాఫలానికి జీఐ ట్యాగ్ సైతం లభించింది.
ప్రతీ సీజన్లో సీతాఫలాల సేకరణతో పెద్దఎత్తున గ్రామీణ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. ఈసారి వాతావరణ పరిస్థితులు సీతాఫలం దిగుబడిపై ప్రభావం చూపుతున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సాధారణంగా సీతాఫలాలు జూలై నుంచి ఆగస్టు మధ్య పూత పిందెగా మారి, సెప్టెంబర్ మొదటివారంకల్లా కాయలు పక్వానికి వస్తాయి. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు గతి తప్పాయి. రోజులతరబడి వానలు లేకపోవడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెట్లకు పిందెలు నిలువలేదు. సాధారణంగా ఒకో చెట్టుకు 50 నుంచి 60 కాయలు ఉండాలి. కానీ ప్రస్తుతం పదికి మించి కనిపించడం లేదు. వాస్తవంగా సహజంగా పెరిగే సీతాఫలం చెట్ల సంఖ్య కూడా తగ్గుతున్నదని, దీనికి ఎల్ నినో తోడైనట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. గుట్టలు తొలగించడం, క్వారీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, భూముల వినియోగంలో మార్పులతో సహజ సీతాఫలం చెట్ల విస్తీర్ణం తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దిగుబడి తగ్గడంతో డిమాండ్ ఎక్కువై రేట్లు అమాంతం పెరిగాయి. నిరుడు ఒక్కో కాయ రూ. 5 నుంచి 10 వరకు విక్రయించారు. గంపల లెకన అయితే రూ.200 నుంచి రూ.250 వరకు అమ్మారు. గ్రామీణ ప్రాంతాలకంటే హైదరాబాద్ వంటి పట్టణాల్లో సీతాఫలాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకొక సీతాఫలాన్ని నాణ్యత, బరువును బట్టి.. రూ. 30 నుంచి 50 వరకు అమ్ముతున్నారు. ఆశించినస్థాయిలో సీతాఫలాల దిగుబడి కనిపించకపోవడంతో ఉపాధి సైతం తగ్గింది. పండ్లను సేకరించిన తర్వాత ప్రాసెసింగ్ చేసే మహిళాసంఘాల సభ్యులు సైతం పనులు లేక ఖాళీగా ఉన్నారు. నిరుడు ఇదే సమయానికి దాదాపు 60 శాతం వరకు సీతాఫలాల ప్రాసెసింగ్ నిర్వహించినవారికి ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక పండూ రాలేదంటే పరిస్థితి ఏరకంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

