హైదరాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాలపై లోక్సభ ఎన్నికల ప్రభావం పడింది. ఆదివారం ప్రవేశపరీక్ష నిర్వహించగా, ఫలితాలను విడుదలపై అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పునరాలోచనలో పడ్డారు. ఉన్నతాధికారులను సంప్రదించి ఓ నిర్ణ యం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆరు నుంచి పదోతరగతిలో ప్రవేశాలకు ఆదివారం జరిగిన పరీక్షకు 51,525 మంది విద్యార్థులు హాజరుకాగా, 11,457మంది డుమ్మా కొట్టారు.