మెదక్: ఏడుపాయల (Edupayala) వనదుర్గ ఆలయం మరోసారి మూతపడింది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద పోటెత్తింది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమ్మవారి దర్శనాలను నిలిపివేశారు. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలతో ఈ నెలలో ఏడు పాయల ఆలయం మూతపడటం ఇది మూడో సారి.
ఈ నెలారంభంలో మెదక్ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టాయి. దీంతో సింగూరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఆలయం నీటమునిగింది. దీంతో ఎనిమిది రోజులపాటు అధికారులు ఆలయాన్ని మూసివేశిన విషయం తెలిసిందే.