హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): నిర్మల్‌లోని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ప్రజాపక్ష విద్యావేత్త ఆరేపల్లి విజయ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ పీపుల్స్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సస్పెన్షన్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తుండగా, విజయ్‌కుమార్ వారికి మద్దతు గా నిలిచారని చెప్పారు. ఇది సహించని సదరు కంపెనీ ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఈ చర్యలకు పాల్పడిందని మండిపడ్డారు.