హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ కంపెనీకి వర్ కాంట్రాక్ట్ మంజూరులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మనీలాండరింగ్ నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్‌లో పలుచోట్ల శుక్రవారం సోదాలు నిర్వహించింది.
ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ జల్ బోర్డ్ (డీజేపీ) మాజీ చీఫ్ ఇంజినీర్ జగదీష్‌కుమార్ అరోరా, ఇతరులకు సంబంధించిన ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టింది. రూ.41లక్షల నగదు, పలు పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. కాగా, రూ.38 కోట్ల కుంభకోణంలో ఇప్పటికే 8.80 కోట్ల విలువైన ఆస్తులను ఈడీకి తాతాలికంగా అటాచ్ చేసింది.