హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంటిపై ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్‌చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పటాన్‌చెరులోని మూడు ప్రాంతాలతోపాటు నిజాంపేటలోని మహిపాల్‌రెడ్డి బంధువల నివాసాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
లక్డారం గనుల వ్యవహారంలో గతంలో పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్‌రెడ్డిపై కేసు నమోదయింది. దాని ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.