ఫేక్ కాల్సెంటర్లపై ఈడీ దాడులు
అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యవస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు ఈనెల 15న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పటియాలా, పుణె, చండీగఢ్‌లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, 3 నకిలీ కాల్‌సెంటర్లు ఉన్నట్టు గుర్తించారు.
- అమెరికన్లను టార్గెట్‌గా మోసాలు.. 220 మంది నిందితుల గుర్తింపు
- పటియాలా, పుణెలో సోదాలు
- డిజిటల్ పరికరాలు స్వాధీనం
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యవస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు ఈనెల 15న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పటియాలా, పుణె, చండీగఢ్‌లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, 3 నకిలీ కాల్‌సెంటర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో పటియాలాలో రెండు, పుణెలో ఒకటి ఉన్న ట్టు తేల్చిన అధికారులు ఆయా ప్రాంతా ల్లో తాజాగా సోదాలు చేపట్టారు.
వీటిల్లో సుమా రు 220 మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా 66 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు, హార్డ్డిస్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు, నగదు, పలు రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఆయా డిజిటల్ ఆధారాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. కాల్ క్యాంపెయిన్లు, స్రిప్టులు, డయలర్, బాధితుల డాటా, చెల్లింపు మార్గా లు, కాల్‌సెంటర్ల నిర్వాహకుల వివరాలు, మోసాల ద్వారా వచ్చిన నగదు ప్రవాహంపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

