క్యాసినో.. మరో ముగ్గురికి నోటీసులు జారీచేసిన ఈడీ
Casino | క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని
హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులైన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. తాజాగా విమానాల ఆపరేటర్ సంపత్‌తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లకు నోటీలు ఇష్యూ చేసింది.
కాగా, ఏజెంట్లు చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇండ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ.. దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారిద్దరి బ్యాంకు ఖాతాల్లో రూ.25 కోట్ల లావాదేవీలను గుర్తించింది. వారి ఖాతాల నుంచి రాజకీయ నాయకులు, అధికారులకు నగదు బదీలీలు జరిగినట్లు తేలింది. దీంతో ఆయా లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆరాతీస్తున్నారు.
ఏడాది వ్యవధిలో గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్లు గుర్తించారు. అదేవిధంగా హవాలా మార్గంలో డబ్బులు తీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చారని, దీనికోసం బేగంబజార్, జూబ్లీహిల్స్‌కు చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సహాయం తీసుకున్నట్లు తేలింది. కాగా, ఫెమా నిబంధనల ఉల్లంఘనలో పూర్తి ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- casino
- ED
- notice
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

