క్షమాపణ చెప్పాలి: వంగపల్లి
వీణవంక, సెప్టెంబర్ 8: మనువాద ముసుగులో ఉన్న ఈట ల రాజేందర్ ఎస్సీ ఎమ్మెల్యేలను దద్దమ్మలంటూ దుర్భాలాడుతున్నారని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపెల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఎమ్మెల్యేలను విమర్శించే అర్హత నీకుందా అని ప్రశ్నించారు. బుధవారం కరీంనగర్ జిల్లా వీణవంకలో మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై ఏ మా త్రం అభిమానం, గౌరవమున్నా ఎస్సీ బిడ్డలైన రవిశంకర్, అరూరి రమేశ్‌కు 48 గంట ల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే తదుపరి జరిగే చర్యలకు ఈటల బాధ్యత వహించా ల్సి ఉంటుందని చెప్పారు. ‘హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుంచి నీ ఇంటి దాకా డప్పు కొట్టుకుంటూ శవయాత్రగా వెళ్తామని, ఇంటిని ముట్టడిస్తామని’ వంగపల్లి హెచ్చరించారు.