కమలాపూర్, సెప్టెంబర్ 21: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. మంగళవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఎన్నికపై రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా? అని నిలదీశారు. హుజూరాబాద్‌లో అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించి, డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఉద్యమంలో ఏనాడైనా పోలీసుల దెబ్బలు తిన్నవా? పోలీసు కేసులున్నయా? జైలుకుపోయినవా? తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసినవా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఏం చేస్తున్నడో తమకు తెలుసునని, చిట్టా విప్పితే ఆయనకు భార్య కూడా తిండి పెట్టదని ఎద్దేవా చేశా రు. అహర్నిశలు రాష్ర్టాభివృద్ధి కోసం కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్‌పై పిచ్చికూతలు మానుకోకపోతే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. డ్రగ్స్ టెస్టు కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రాహుల్‌గాంధీని తీసుకొని రావాలన్న కేటీఆర్ డిమాండ్‌పై రేవంత్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర విహారయాత్రలా ఉన్నదని ఎద్దే వా చేశారు. ఢిల్లీ నుంచి వస్తున్న బీజేపీ నాయకులు టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారు త ప్ప, తెలంగాణకు ఏం చేస్తారో చెప్పడం లేదని విమర్శించారు. హుజూరాబాద్ అభివృద్ధికి ప్ర త్యేక ప్యాకేజీ తీసుకొస్తామని చెప్పే దమ్ము బీ జేపీ నేతలకు ఉన్నదా అని సవాల్ విసిరారు.
ఇరువై ఏండ్లలో ఈటల ఏం చేయలె
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో ఒక రైతు పొలంలో పనిచేస్తున్న రైతుకీ, ప్రభు త్వ విప్ బాల్క సుమన్కీ మధ్య మంగళవారం ఆసక్తిర సంభాషణ జరిగింది. కమలాపూర్‌లో అయ్యప్పస్వామి ఆల య నిర్మాణానికి శంకుస్థాపన చేసి, తిరిగి వస్తున్నప్పుడు పొలంలో ఎరువులు చల్లుతున్న రైతు మౌటం రాజుతో ఆయ న కాసేపు ముచ్చటించారు. ఏ పార్టీకి ఓటేస్తరు.. ఈటల రాజేందర్‌కు.. ఓటేస్తరా? అని బాల్క సుమన్ అడిగారు. 20 ఏండ్లలో ఈటల రాజేందర్ చేసిందేమీలేదని, ఆయన అనుచరులే బాగుపడ్డరని రాజు జవాబిచ్చారు. తాను టీఆర్ఎస్కే ఓటేస్తానని చెప్పాడు. ‘సీఎం కేసీఆర్ సార్ 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నడు. తెల్లందాక బావులకాడికి పోకుండా పొద్దాకనే కరెంటు పె ట్టుకుని రాత్రి ఇంటివద్దనే ఉంటున్నం.. గతంలో ఏ పార్టీ చేయని పనులు కేసీఆర్ రైతులకు చేసిండు’ అని చెప్పారు.