TS EAMCET | హైదరాబాద్ : ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు శనివారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బీ ఫార్మసీ, ఫార్మా డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వెబ్ కౌన్సెలింగ్లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్బుకింగ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ నెల 4, 5 తేదీల్లో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 4 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. పూర్తి వివరాల కోసం https://tseamcetb.nic.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. బీ ఫార్మసీకి సంబంధించి 114 కాలేజీల్లో 6910 కన్వీనర్ కోటా సీట్లు, ఫార్మ్ -డీలో 61 కాలేజీల్లో 1191 కన్వీనర్ కోటా సీట్లు, బయోటెక్నాలజీలో 94, బయోమెడికల్ ఇంజినీరింగ్లో 36, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్లో 81 సీట్లు ఉన్నాయి.