హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల విద్యాసంస్థల్లో మోటివేషన్ తరగతుల పేరుతో ఆధ్యాత్మిక భావజాలం కలిగిన బ్రహ్మకుమారీస్ సంస్థని తీసుకురావడాన్ని ప్రభుత్వం వెంటనే వెనకి తీసుకోవాలి డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావీద్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ చేశారు.
గురుకులాల విద్యార్థులకు తీవ్ర ఒత్తిడి పెంచేలా పనివేళలను మార్చి, ఇప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోవాలనే పేరుతో బ్రహ్మకుమారీస్ సంస్థను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రీయ విద్యతోనే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యమని తెలిపారు.
ఎస్సీఆర్ ఏజీఎంగా బాధ్యతలు
హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ అడిషనల్ జీఎంగా నీరజ్ అగర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియన్ రైల్వేస్ సర్వీసెస్ ఇంజినీర్స్ 1987 బ్యాచ్‌కు చెందినవారు.