హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు బంగారు కిరీటాన్ని కానుకగా అందజేశారు. ద్వారకాతిరుమలకు చెందిన మొగతడకల శ్రీనివాసరావు, లక్ష్మీరమణి దంపతులు వారి కుటుంబసభ్యులతో కలిసి రూ.10.50 లక్షల విలువ గల బంగారు కిరీటాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలు ఈ కిరీటాన్ని 140గ్రాముల బరువుతో తయారుచేయించారు. అనంతరం ఆలయ అధికారులు దాతలను అభినందించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.