అక్టోబర్ 6 నుంచి దసరా సెలవులు

- వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ఎస్సెస్సీ పరీక్షలు
- 213 పనిదినాలతో 2021-22 విద్యాసంవత్సరం
- 166 రోజులు ప్రత్యక్ష, 47 రోజులు ఆన్లైన్ క్లాసులు
- అకడమిక్ క్యాలెండర్‌ను విడుదలచేసిన విద్యాశాఖ
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి, ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది దసరా సెలవులు వచ్చేనెల 6 నుంచి 17 వరకు 12 రోజులు ఉంటాయి. 2021- 22 విద్యాసంవత్సరానికి 1-10 తరగతుల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం విడుదలచేశారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహించిన 47 రోజుల ఆన్లైన్ తరగతులను కలుపుకొని పాఠశాలలు మొత్తం 213 రోజులు పనిచేస్తాయని ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకాగా, 166 రోజులు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. స్కూళ్లు భౌతికంగా ప్రారంభమైన సెప్టెంబర్ 1 నుంచి రీ ఓపెన్ చేసినట్టు క్యాలెండర్లో పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు ఆఖరి పని దినంగా నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 2 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తారు.
పిల్లల హెల్త్ ప్రొఫైల్..
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్థానిక ఆరోగ్య కేంద్రాల సాయంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎవరికైనా చికిత్స అవసరమైతే రెఫరల్ దవాఖానలకు తీసుకెళ్లాలని అకడమిక్ క్యాలెండర్లో సూచించారు. పిల్లల క్యుములేటివ్ రికార్డుల్లో హెల్త్ కార్డులను సైతం ముంద్రించాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని ఏడాదిలో రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.
క్యాలెండర్‌లోని కీలకాంశాలు
- 1-9 తరగతులకు సిలబస్‌ను 2022 ఫిబ్రవరి 28లోపు పూర్తిచేయాలి. అన్ని తరగతులకు రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్లు (ఎఫ్ఏ), 2 సమ్మేటివ్ అసెస్మెంట్లు (ఎస్ఏ) నిర్వహించాలి.
- జనవరి పదికి టెన్త్ సిలబస్ పూర్తి
- ఎఫ్ఏ-1ను 2022 అక్టోబర్ 5లోపు నిర్వహించాలి.
- ఎఫ్ఏ-2ను 1-9 తరగతులకు జనవరి 28న, ఎస్సెస్సీకి జనవరి 31లోపు నిర్వహించాలి.
- అన్ని తరగతులవారికి డిసెంబర్ 1-8 మధ్య ఎస్ఏ-1, 2022 ఏప్రిల్ 7-18 మధ్య ఎస్ఏ-2 నిర్వహించాలి.
- ఫిబ్రవరి 28లోగా టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి
- మార్చి, ఏప్రిల్‌లో టెన్త్ వార్షిక పరీక్షలు
- ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు.
ప్రదర్శనలు
- ఇన్స్పైర్ జిల్లాస్థాయి ఎగ్జిబిషన్‌ను ఈ నెల 21 నుంచి వచ్చేనెల 5 లోపు, రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్‌ను వచ్చేనెల చివరివారంలో, జాతీయ ప్రదర్శనను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహిస్తారు.
- సైన్స్ సెమినార్లు, జేఎన్ఎన్ఎస్ఎంఈఈను జిల్లాస్థాయిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో, రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్ డిసెంబర్, జనవరిలో నిర్వహిస్తారు.
- నవంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలుంటాయి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశాలు, పాఠశాలల్లో పాఠ్యేతర కార్యాక్రమాలు (ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్) నిర్వహించాలని క్యాలెండర్లో సూచించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

