T-NAB | 25 ఏండ్ల మత్తు దందా గుట్టు రట్టు.. ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టిన డ్రగ్ వ్యాపారి
అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడుకు రాజశేఖర్‌గౌడ్‌ను విచారించగా.. తీగ లాగితే డొంక కదిలినట్టు రాష్ట్రంలో ఆల్ఫ్రాజోలం గుట్టు బయటపడింది.
- ఆల్ఫ్రాజోలం లింక్‌ను ఛేదించిన టీన్యాబ్
- ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా నగరానికి
T-NAB | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): అత్యంత హానికర డ్రగ్ ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో రూ.కోట్లు కూడగట్టుకున్న డ్రగ్ వ్యాపారి గుట్టు రట్టు చేశారు టీన్యాబ్ పోలీసులు. ఇటీవల ఈ డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సుక్క నర్సింహాగౌడ్, అతడి కొడుకు రాజశేఖర్‌గౌడ్‌ను విచారించగా.. తీగ లాగితే డొంక కదిలినట్టు రాష్ట్రంలో ఆల్ఫ్రాజోలం గుట్టు బయటపడింది. టీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా కథనం ప్రకారం.. సుక్క నర్సింహాగౌడ్ గత 25 ఏండ్ల నుంచి యథేచ్చగా అల్ఫ్రాజోలం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రప్పించి కల్లు డిపోలకు విక్రయిస్తున్నాడు. 1995 నుంచి ఇతడు ఢిల్లీ కేంద్రంగా ఈ డ్రగ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
ఢిల్లీలోని భాటియా, అతడి కొడుకు ప్రమోద్‌సింగ్ నుంచి దీన్ని కొంటున్నాడు. దాన్ని ఎవరికీ అనుమానం రాకుండా మెట్రో కొరియర్ సర్వీస్ ద్వారా రాష్ర్టానికి తరలిస్తూ, హవాలా ద్వారా డబ్బు చెల్లిస్తున్నాడు. కిలో రూ.2.4 లక్షలకు కొని, రూ.3.5 లక్షలకు విక్రయిస్తున్నాడు. విఠల్‌గౌడ్, అతడి కొడుకు నరేందర్‌గౌడ్ నుంచీ నర్సింహాగౌడ్.. ఈ మత్తు పదార్ధాన్ని కొనుగోలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఆల్ఫ్రాజోలం వ్యాపారంతో నర్సింహాగౌడ్ కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్టు టీన్యాబ్ గుర్తించిందని సందీప్ శాండిల్యా తెలిపారు. గచ్చిబౌలిలో రూ.3.5 కోట్ల భవనం, కొండాపూర్‌లో రూ.5.4కోట్ల విలువైన 3 ప్లాట్లు, కొల్లాపూర్‌లో రూ.కోటి విలువ చేసే 9 ఎకరాల వ్యవసాయ భూమి కొన్నట్టు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

