హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. శనివారం నుంచి వెబ్సైట్లో కీ అందుబాటులో ఉంటుందని కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 8న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది మే 27న ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. అభ్యర్థుల రెస్పాన్స్షీట్లను వెబ్సైట్లో పొందుపరిచింది. జూన్ 1 నుంచి 3 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాత తుది కీని కమిషన్ విడుదల చేసింది.