కరువు మండలంగా ప్రకటిస్తే ఉపశమనం!
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో మొత్తం 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
- పంట రుణాలపై ఊరట .. రీషెడ్యూల్, మారటోరియానికి చాన్స్
- తాగునీరు, పశుగ్రాసం పంపిణీపై శ్రద్ధ.. కేంద్రం నుంచి నిధులు
- ఉపాధి హామీ పనుల విస్తరణకు అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తేతెలంగాణ): ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో మొత్తం 365 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 111 మండలాలు తీవ్ర కరువు జాబితాలో ఉండగా, 254 మండలా లు మోస్తరు కరువు పరిధిలో ఉన్నాయి.
ఈ ‘కరువు’ ప్రకటనతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు ఉపశమనం లభిస్తుందని అధికార వర్గా లు తెలిపాయి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణులకు కొంత ప్రయోజనం కలుగుతుందని వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఆర్ఎఫ్ నిధులు కోరే అవకాశం ఉంటుందని చెప్తున్నాయి.
రైతులకు సాయం
కరువు వల్ల పంట నష్టపోయిన రైతులకు సాయం అందించేందుకు ప్రభుత్వాలు ముం దుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. విత్తనాలు, ఎరువులు ఇతరత్రా వ్యవసాయ పెట్టుబడుల కోసం ఆర్థికసాయం అందుతుందని పేర్కొన్నారు. ప్ర త్యామ్నాయ పంటల సాగుకు కేంద్రం ద్వారా ప్రోత్సాహకం అందుతున్నాయని తెలిపారు. కరువు ప్రాంతాల్లోని రైతుల వ్యవసాయ రు ణాల రీషెడ్యూలింగ్‌కు అవకాశం కలుగుతుం ది. రుణ చెల్లింపులపై మారటోరియం విధిస్తా రు. కొన్నిసార్లు స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా రీషెడ్యూల్ చేసే అవకాశం ఉం టుంది. బలవంతపు రుణ వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రాబోయే పంటకాలానికి కొత్త రుణాలు కూడా పొందేందుకు వీలు కలుగుతుంది.
తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా..
కరువు మండలాల్లో తాగునీటి కొరతను నియంత్రించడానికి ప్రభుత్వం ట్యాంకర్ల వంటి ప్రత్యేక రవాణా సదుపాయాల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. వాడకుండా వదిలేసిన బోర్లు, చేతిపంపుల మరమ్మతులు చేయిస్తుంది. పశువుల కోసం కూడా ప్రత్యేంగా తాగునీటి వసతిని సమకూర్చుతుంది. పశువులకు గడ్డికొరత లేకుండా చర్యలు తీసుకుంటారు. ఉచితంగా లేదా రాయితీపై పశుగ్రాసం అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేకంగా పశు శిబిరాలు ఏర్పాటు చేస్తారు.
ప్రత్యామ్నాయ పనులు
కరువుతో వ్యవసాయ రంగం దెబ్బతిని రైతులు, రైతు కూలీలు ఉపాధి కోల్పోతారు. గ్రామీణ పేదలు, కూలీల కోసం ఉపాధి హామీ (జీరామ్‌జీ) పథకం కింద అదనపు పనిదినాలు కల్పించే అవకాశం ఉంటుంది. వారికి స్థానికంగా ఉపాధి లభించడంతో ఇతర ప్రాంతాలకు వలసలు నివారించవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఆర్థికసాయం
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. వీటికి అదనంగా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని కోరే అవకాశం కలుగుతుంది. దీంతో కరువు నివారణ, రైతుల సహాయ కార్యక్రమాలకు అదనపు నిధులు పొందవచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

