315 మండలాల్లో కరువు
వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి తెలిపారు.
- కేంద్రం తక్షణ సహాయం అందించాలి: తుమ్మల
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరారు. శనివారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మకజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా అన్ని ప్రధాన పంటలను కనీస మద్దతుపై 100 శాతం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరమున్నదని మంత్రి తెలిపారు. వీబీరామ్జీ పథకం కింద నిధుల కేటాయింపును పెంచడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

