
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్, కవిసంధ్య పత్రిక సంపాదకుడు డాక్టర్ శిఖామణికి అజో-విభొ-కందాళం సాహితీ పురస్కారం లభించింది. అప్పాజోస్యుల, విష్ణుభొట్ల, కందాళం (అజో-విభొ) ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక విశిష్ట సాహితీ పురస్కారం-2022 సంవత్సరానికి శిఖామణిని ఎంపికచేసినట్టు సంస్థ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. ప్రముఖ రచయితలు తల్లావజ్జల పతంజలిశాస్త్రి, మాకినీడి సూర్యభాస్కర్కు సైతం పురస్కారాలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరిగే ఫౌండేషన్ 29వ వార్షికసభల్లో ఈ పురస్కారాలను అందజేస్తారు.