ఉప్పల్, జూలై 9: ఉప్పల్లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ)లో ముఖ్యశాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ బి ప్రశాంత కె పాత్రో ప్రతిష్టాత్మకమైన జాతీయ భూవిజ్ఞాన పురస్కారం-2023కి ఎంపికయ్యారు. భూభౌతిక శాస్త్రం, ఐప్లెడ్ భూభౌతిక శాస్త్ర రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ నేషనల్ జియోసైన్స్ అవార్డును అందించింది. ఇటీవల డాక్టర్ పాత్రో పలు పరిశోధనలు చేశారు. మాగ్నెటో టెల్లూరిక్ రెస్పాన్స్ ఫంక్షన్లను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి కొత్త 3-డీ ఇన్వర్షన్ సాంకేతికతలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. పలువురు శాస్త్రవేత్తలు డాక్టర్ పాత్రోను అభినందించారు.