హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్టు, లా ప్రొఫెసర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ మాడభూషి శ్రీధర్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ గురువారం పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, వారి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు. రెండ్రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శ్రీధర్‌ను కిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.