హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (హెచ్ఎంఏటీ) అధ్యక్షుడిగా డాక్టర్ కే గోపాలకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. 2023-25కు సంబంధించి కార్యవర్గం ఆదివారం ఎన్నికైనట్టు ఆసోసియేషన్ తెలిపింది. ప్రధానకార్యదర్శిగా డాక్టర్ దుర్గాప్రసాద్రావు, కోశాధికారిగా డాక్టర్ వేణుగోపాల్ గౌరి ఎన్నికైనట్టు వెల్లడించారు.
ఉపాధ్యక్షులుగా కేఎస్ గుప్త, మాణిక్ ప్రభు, రాజశ్రీ షా, ఆనంద్ రావు మెంగ్జి ఎన్నికయ్యారని తెలిపారు. సాంకేతిక సలహాదారుగా సీవీ స్వామి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా యన్యస్ రఘు రాం, సహాయ కార్యదర్శులుగా మధు వారణా శి, గణేశ్ ఆచారి, అన్నపూర్ణ మంతా, గౌతం రాళ్ళబండిని ఎన్నుకొన్నట్టు వెల్లడించారు.