Lenin | ‘లెనిన్’లో అఖిల్ ఫ్రెండ్‌గా మెప్పించిన నటుడు ఎవరు.. సలార్‌లోనూ కీలక పాత్ర చేసిన ప్రమోద్ పంజు!
Lenin | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ గ్రామీణ ప్రేమకథ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మొదటి రోజే రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్గా నిలిచింది.
Lenin | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ గ్రామీణ ప్రేమకథ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, మొదటి రోజే రూ.16 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్గా నిలిచింది. ఈ చిత్రంలో అఖిల్‌తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే తన నటనతో ఆకట్టుకోగా, సీనియర్ నటులు శివాజీ, ఈశ్వరీ రావు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే వీరితో పాటు మరో నటుడు ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షించాడు. అతడే అఖిల్ స్నేహితుడు వసంత్ పాత్రలో నటించిన ప్రమోద్ పంజు.
‘లెనిన్’లో వసంత్ పాత్ర కథకు కీలకంగా మారుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ప్రీ క్లైమాక్స్ జాతర ఎపిసోడ్లో ప్రమోద్ పంజు నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భావోద్వేగ సన్నివేశాల్లోనూ, యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ తన సహజమైన నటనతో మెప్పించిన ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ప్రేక్షకులు జాతర సీన్లో ప్రమోద్ పంజు తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో అఖిల్‌కు సమానంగా నిలిచాడని అభిప్రాయపడుతున్నారు. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో కూడా అక్కినేని నాగార్జున ప్రమోద్ పంజు నటనను ప్రత్యేకంగా ప్రశంసించారు. దీంతో ఈ నటుడు ఎవరు? ఇంతకుముందు ఏ సినిమాల్లో నటించాడు? అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారు.
ప్రమోద్ పంజు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటుడు. తొలుత టెలివిజన్ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కన్నడలో హీరోగా, విలన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ప్రమోద్ పంజు కొత్తవారు కాదు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ సినిమాలో కూడా ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ సోదరుడు బాచి రాజమన్నార్ పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ‘లెనిన్’లో వసంత్ పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రమోద్ పంజు, ఈ సినిమాతో మరింత గుర్తింపు పొందుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ వేగంగా పెరుగుతుండగా, భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో మరిన్ని కీలక పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- fan
- Lenin
- naga akhil
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

