Lenin Rampage | బాక్సాఫీస్ వద్ద అఖిల్ ‘లెనిన్’ ర్యాంపేజ్.. రెండు రోజుల్లోనే రూ.37.2 కోట్లు!
Lenin Rampage | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Lenin Rampage | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో అఖిల్ ఊరమాస్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతుండటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మౌత్ టాక్ లభిస్తోంది. ఆడియన్స్ నుండి వస్తున్న భారీ రెస్పాన్స్‌తో ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 37.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగిస్తూ దూసుకుపోతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూరల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ మరియు మనం ఎంటర్ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత అఖిల్‌కు సాలిడ్ కమర్షియల్ హిట్ పడటంతో అక్కినేని అభిమానులు థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. వీకెండ్ ముగిసేసరికి ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

