Telangana | తెలంగాణలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న డీపీ వరల్డ్
Telangana | తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
Telangana | హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. అగ్నిమాపక సామాగ్రి తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో(NAFFCO) కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో రూ. 700 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా ప్రపంచ స్థాయి దిగ్గజ పోర్టు ఆపరేటివ్ డీపీ వరల్డ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో రాష్ట్రంలో రూ. 215 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ సంస్థ ప్రకటించింది. దుబాయ్‌లో కేటీఆర్‌తో డీపీ వరల్డ్ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇన్లాండ్ కంటైనర్ డిపో ఆపరేషన్ కోసం డీపీ వరల్డ్ పెట్టుబడులు పెట్టనుంది. రూ. 165 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వెల్లడించింది. మేడ్చల్‌లో రూ. 50 కోట్లతో కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌజ్ నిర్మించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. డీపీ వరల్డ్ లాజిస్టిక్స్‌లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ముందుకు రావడం సంతోషకరమన్నారు. డీపీ వరల్డ్‌కు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

