హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ 2025-26 స్పెషల్ ఫేజ్ గడువును పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వీ బాలకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్పెషల్ ఫేజ్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 వరకు రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా, ఆగస్టు 12 వరకు పొడిగించామని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో ఇంజినీర్ల ఉద్యోగోన్నతులకు అడ్డంకులు తొలగించి దక్షిణ తెలంగాణ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడంపై హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు రాపోలు రవీందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, పూర్వపు అధ్యక్షుడు మహేందర్, ఏఎన్ఎస్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
33 ఏళ్ల తర్వాత డీపీసీతో పాటు 262 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం సంతోషకరమని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1122 ఇంజినీర్లను నియమించడంతో పనిభారం తగ్గుతుందని, తమ విజ్ఞప్తికి స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.