తండ్రిని రోడ్డుపై వదిలేసిన వైద్యుడు
ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న తనను రోడ్డుపై వదిలేసి వెళ్లాడని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన సన్నీల్ల వెంకన్న శుక్రవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
- కొడుకు, భార్యపై పీఎస్‌లో ఫిర్యాదు చేసిన వెంకన్న
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఘటన
హుస్నాబాద్, సెప్టెంబర్ 5: ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్న తనను రోడ్డుపై వదిలేసి వెళ్లాడని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన సన్నీల్ల వెంకన్న శుక్రవారం హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, కొడుకు తనను కొంత కాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని, అనారోగ్యంతో ఉన్న తనను పట్టించుకోకుండా కరీంనగర్ బస్టాండ్‌లో వదిలి వెళ్లారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు.
ఆస్తులు అమ్మి కొడుకు, కూతురిని డాక్టర్లను చేశానని, అనారోగ్యం పాలైన తనను వాళ్లెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశా డు. తన కొడుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడని తెలిపాడు. తనకు వైద్యం అందించకుండా కరీంనగర్ సర్కారు దవాఖానలో వేసి వెళ్లారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దవాఖాన నుంచి డిశ్చార్జి చేసి కరీంనగర్ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లారని వాపోయాడు. బంధువుల సాయంతో హుస్నాబాద్‌కు చేరుకున్నానని తెలిపాడు. భార్య, పిల్లలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Father
- govt doctor
- Karimnagar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

