హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రామేశ్వరరావుతో గురువారం డిప్యూటీ ఈవో ధర్మారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. రామేశ్వరరావుకు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.
టీటీడీ ఉద్యోగులకు హెల్త్ఫండ్
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రతకు కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఉద్యోగుల హెల్త్ఫండ్కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. గురువారం టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్ములో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లు, అలిపిరి కాలిబాట సుందరీకరణకు రూ.7.50 కోట్లు మంజూరు చేశారు.