గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 01:54:58

విద్యుత్‌ ఉద్యోగులను అడ్డుకోవద్దు

విద్యుత్‌ ఉద్యోగులను అడ్డుకోవద్దు

  •  ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అత్యవసర సేవల్లో విద్యుత్‌శాఖ కూడా ఉన్నదని, ఆ శాఖ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవుపల్లి ప్రభాకర్‌రావు కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో నిరంతరం విద్యుత్‌ సరఫరా జరుగాలంటే.. ఆ శాఖ అధికారులు, లైన్‌మెన్లు నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వారు విధులకు వెళ్లేటప్పుడు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. వారివిధులకు ఆటంకం కలిగించవద్దని బుధవారం ఒక ప్రకటనలో పోలీసులకు విజ్ఞప్తిచేశారు. 


logo
>>>>>>