న్యూఢిల్లీ, మే 23: దేశీయ రియల్ ఎస్టేట్ సంపన్న వర్గాల జాబితాలో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్‌సింగ్ తిరిగి తొలి స్థానం దక్కించుకున్నారు. గ్రో-హురున్ ఇండియా పేరుతో విడుదల చేసిన జాబితాలో రూ.59,030 కోట్ల సంపదతో ఆయన తొలి స్థానంలో నిలిచారు. 16 నగరాలు 67 కంపెనీల నుంచి 100 మంది వ్యక్తిగత సంపద ఆధారంగా గ్రో-హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్‌లిస్ట్ 2023 పేరుతో జాబితాను రూపొందించింది.
ఈ జాబితాలో తెలంగాణ నుంచి జీ అమరేందర్‌రెడ్డి కుటుంబం రూ.15 వేల కోట్ల సంపదతో టాప్ టెన్ స్థానంలో నిలిచింది. జూపల్లి రామేశ్వర్రావు రూ.9,490 కోట్లతో 13వ స్థానంలో నిలిచారు. 100 మంది రియల్ ఎస్టే ట్ వ్యాపారస్తుల మొత్తం సంపద విలువ రూ.4,72,330 కోట్లు (57 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. నిరుడు కంటే ఇది 4 శాతం అధికం. మహారాష్ట్ర నుంచి 37 మందికి చోటు దక్క గా, ఢిల్లీ నుంచి 23, కర్ణాటక నుంచి 18 మందికి చోటు లభించింది.