TG Weather | మూడు రోజులు చలి.. తర్వాత వానలు.. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం
TG Weather | నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆదివారం పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశమున్నదని అధికారులు అంచనా వేశారు.
TG Weather | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నెమ్మదిగా కదులుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఆదివారం పుదుచ్చేరి తీరానికి చేరుకునే అవకాశమున్నదని అధికారులు అంచనా వేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని చెప్పారు. ఈ నెల 30 వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలులు వీచే అవకాశమున్నదని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తిరిగి 9 నుంచి 11 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయే అవకాశాలుంటాయని అంచనా వేశారు.
హైదరాబాద్‌లోనూ 3 రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరించారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

