మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 25 : ఓ ఉద్యోగి సస్పెన్షన్ ఎత్తివేయడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా కోఆపరేటివ్ అధికారి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి అధికారి రాథోడ్ బికు నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏడాది క్రితం ఓ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. సదరు ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాల మంజూరు, సస్పెన్షన్ ఎత్తి వేసేందుకు బిక్కు నాయక్ రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.5 లక్షలకు బేరం కుదిరింది. మొదటి విడతగా శనివారం ఉదయం డీసీవో నివాసంలో రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అనంతరం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.