‘పవర్’ఫుల్ తెలంగాణ
దేశం మొత్తం మీద పవర్‌హాలిడేలు, కరెంటు కోతలు లేని పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయని చెప్పారు.
‘సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలున్నాయి. ఏపీలో ఆరు, కర్ణాటకలో నాలుగు గంటలు కరెంటు కోతలేస్తున్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్ హాలిడే అమలుచేస్తున్నారు. దేశానికి సరిపడా కరెంటు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం చేతగాని తనంతోనే కరెంటు ఉత్పత్తి, పంపిణీ చేయడం లేదు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణలో మాత్రమే పవర్ హాలిడేలు, కరెంటు కోతలు లేవు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం పవర్ఫుల్ స్టేట్. టీఆర్ఎస్ పాలన మోదీ పాలన కంటే మెరుగ్గా ఉన్నదనడానికి కరెంటు సరఫరానే నిదర్శనం.
-మంత్రి హరీశ్‌రావు
- మోదీ స్వరాష్ట్రం గుజరాత్ సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు
- బీజేపీ చేతకాని తనంతోనే ఇక్కట్లు
- పటాన్చెరులో దళితబంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): దేశం మొత్తం మీద పవర్‌హాలిడేలు, కరెంటు కోతలు లేని పవర్ ఫుల్ స్టేట్ తెలంగాణ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం సహా సగం రాష్ర్టాల్లో కరెంటు కోతలు అమలవుతున్నాయని చెప్పారు. గుజరాత్లో పరిశ్రమలకు ఒకరోజు పవర్ హాలిడే అమలుచేస్తున్నారని గుర్తుచేశారు. దేశానికి అవసరమయ్యే కరెంటును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతగాని తనంతోనే విద్యుత్తు కష్టాలు వెన్నాడుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రం పవర్ఫుల్ స్టేట్‌గా మారిందని వివరించారు. శుక్రవారం ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి నియోజకవర్గంలో ఎంపికైన 100 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దళితబంధు పథకం సీఎం కేసీఆర్ గుండెల్లో నుంచి పుట్టిందని చెప్పారు. ఝూటా పార్టీ బీజేపీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచిందని, ఈపీఎఫ్ వడ్డీని 8.1 శాతానికి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ రాష్ర్టాల్లో కరెంటు కష్టాలు ఎందుకు ఉన్నాయో, తెలంగాణలో ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 7,778 మెగావాట్లుగా ఉన్న విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం సీఎం కేసీఆర్ ముందుచూపుతో 17,305 మెగావాట్లకు పెరిగిందని వివరించారు. త్వరలో యాదాద్రి విద్యుత్తు ప్లాంటు నుంచి 4 వేల మెగావాట్లు, ఎన్టీపీసీ యూనిట్ల నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. దీంతో తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం 23 వేల మెగావాట్లకు పెరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరంతరం విద్యుత్తు సరఫరా చేసేందుకు యూనిట్‌కు రూ.20 ఖర్చు పెట్టి, రూ.1,200 కోట్లతో విద్యుత్తు కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించారు. పొరుగు రాష్ర్టాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో కరెంటు కొనుగోలు చేయకుండా కోతలు విధిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు పెట్టుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయని పేర్కొన్నారు. కరెంటు కోతలు ఉంటే విదేశీ కంపెనీలు దేశంలో ఎలా పెట్టుబడులు పెడతాయని ప్రశ్నించారు. గుజరాత్లో కరెంటు కోతలు ఎందుకు ఉన్నాయో, తెలంగాణలో ఎందుకు లేవో బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పాలన మోదీ పాలన కంటే మెరుగ్గా ఉన్నదనడానికి కరెంటు సరఫరానే నిదర్శనమని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

