హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్ల పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు.
డాక్టర్ల అడ్రస్‌కు రిజిస్టర్ పోస్టు చేసినట్టు చెప్పారు. ఎవరికైనా అందకపోతే డూప్లికేట్ బ్యాలెట్ పేపర్ల కోసం ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకుంటే పంపనున్నట్టు వెల్లడించారు.