హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ;హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద జీవిత చరిత్ర ఆధారంగా యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ‘విశ్వవిజేత’ పుస్తకాన్ని బంజారాహిల్స్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరిస్తున్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస ప్రభూజీ, ఉపాధ్యక్షుడు మహావిష్ణుదాస ప్రభూజీ, సినీ నిర్మాత శోభు యార్లగడ్డ. ఈ పుస్తకం కావాల్సిన వారు www.vishwavijetha.org లేదా 9505388886 నంబర్లో సంప్రదించవచ్చని సత్యగౌర చంద్రదాస ప్రభూజీ తెలిపారు.