హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తమ విద్యార్థులు రికార్డు స్థాయిలో ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. ఓపెన్ క్యాటగిరీ బాలిక విభాగంలో ఎన్ నాగభవ్యశ్రీ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నారు.
ఆదివారం హైదరాబాద్లో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఓపెన్ క్యాటగిరీలో బాలాజీరెడ్డి నాగిరెడ్డి 9వ ర్యాంకు, ఉజ్వల్ శంకర్ 11వ, యువరాజ్ గుప్తా 13వ, చైతన్య మహేశ్ 15వ, సమీర్ అరవింద్ పాటిల్ 20వ ర్యాంకు కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఫలితాల్లో అత్యధిక ర్యాంకులతో నారాయణ విద్యార్థులు సత్తా చాటారని ప్రశంసించారు. ర్యాంకర్లను వారు అభినందించారు.