హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్ నియామకాల్లో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించాలని కోరుతూ అభ్యర్థులు విద్యాశాఖ అధికారులను కోరారు.
రాష్ట్రంలో ఎన్ఈపీని అమలుచేసి, నర్సరీ నుంచి రెం డో తరగతి వరకు విద్యాబోధన బాధ్యతలను ప్రీ స్కూల్ టీచర్లకు అప్పగించాలని డీపీఎస్ఈ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మేఘన, ప్రధాన కార్యదర్శి సురేశ్, ఉపాధ్యక్షుడు శ్రీకాం త్ సోమవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ర మేశ్కు వినతిపత్రాన్ని సమర్పించారు.