ధర్మపురి, మార్చ్ 6 : జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరు శ్రీనివాస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్ చేయడానికి రూ.20 వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, బాధితుడు పైడిపల్లి మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండకు చెందిన మహేశ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్‌గా ఆర్సీఎస్ (రీజినల్ సెంటర్ ఆఫ్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్) అనే ఏజెన్సీ సంస్థ ద్వారా 2020 డిసెంబర్ 14న నియామకమయ్యాడు. గతంలో మహేశ్‌కు నెలకు రూ.20 వేల జీతం వస్తుండగా.. 2024 ఏప్రిల్ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్, వన మహోత్సవం పనుల బాధ్యతలు అప్పగించడంతో నెలకు రూ.35 వేలు చెల్లించేలా సీడీఎంఏ డైరెక్టర్ నుంచి అప్రూవల్ వచ్చింది.
ధర్మపురిలో గత కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్న సమయంలో క్రమంగా రూ.35 వేల జీతం వచ్చేది. ప్రస్తుత కమిషనర్ కందుకూరు శ్రీనివాస్ వచ్చిన నాటి నుంచి 6 నెలలుగా జీతం రావడంలేదు. డబ్బుల కోసం అడిగితే ‘నేను ఇచ్చినప్పుడే జీతం.. నువ్వు అడిగితే రాదు. ఎకడైనా చెప్పుకో’ అంటూ బెదిరించాడు. అదే సమయంలో రూ.30 వేల లం చం డిమాండ్ చేశా డు. 6 నెలల జీతం రావాల్సి ఉండగా రూ.30 వేలు లం చం ఇవ్వడానికి ఒ ప్పుకొని మొదట రూ.10 వేలు ఇచ్చాడు. మరో రూ.20 వేలు ఇచ్చే సమయంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర యించాడు. పథకం ప్రకారం మహేశ్ కమిషనర్ శ్రీనివాస్‌కు 20 వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.