హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : కొత్తచట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీజీపీ రవిగుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం డీ జీపీ కార్యాలయంలో నూతన చట్టాలపై పో లీసులు రూపొందించిన పోస్టర్లు, సీఐడీ అ భివృద్ధి చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పోలీసుశాఖ రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్ పోస్టర్లను అన్ని పోలీస్స్టేషన్లలో ప్రదర్శించాలన్నారు. కొత్త చట్టాలపై దర్యాప్తు అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు సీఐడీ విభాగంలో ప్రత్యేకం సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సహకారంతో సీఐడీ రూపొందించిన సమగ్ర బుక్‌లెట్‌లో 43 ఎస్‌వోపీలు, 31 ప్రొఫార్మాలు ఉన్నాయని వెల్లడించారు. ఇందుకు సహకరించిన నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ సింగెనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతిని అభినందించారు. కొత్త చట్టాలపై రాష్ట్ర పోలీసులు పోలీసు అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ నేతృత్వంలో శిక్షణ పొందారని తెలిపారు. కొత్త చట్టాల మార్పును రాష్ట్రంలో సాంకేతికంగా పర్యవేక్షించిన ఏడీజీ శ్రీనివాసరావును అభినందించారు. కార్యక్రమంలో ఏడీజీ మహేశ్ భగవత్, ఐజీలు సుధీర్‌బాబు, రమేశ్, గజరావు భూ పాల్, డీఐజీలు, అధికారులు పాల్గొన్నారు.