హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : పౌరులకు భద్రత కల్పించడంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు ఏ మాత్రం అలసత్వం వహించొద్దని సీఐఎస్ఎఫ్ డీజీ రాజ్ విందర్ సింగ్ భట్టి ఉద్బోధించారు. హైదరాబాద్‌లోని నిసాలో సీఐఎస్ఎఫ్ 31వ బ్యాచ్ కానిస్టేబుల్/ఫైర్ బేసిక్ ట్రెయినీల దీక్షాంత్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిప్రమాదాలు, ఇతర భద్రతా అంశాల్లో దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలని తెలిపారు. నిసాలో 1300 మంది కఠిన శిక్షణ తీసుకున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిసా డైరెక్టర్ కే సునీల్ ఇమ్మాన్యుయేల్, సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు పాల్గొన్నారు.