మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 01:38:16

బహుముఖ సాహిత్య సేవకుడు దేవులపల్లి

బహుముఖ సాహిత్య సేవకుడు దేవులపల్లి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/తెలుగు యూనివర్సిటీ: రచయితగా కవిత్వంతోపాటు వచన రచనలు అమితంగా అందించిన డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు తెలుగు సాహిత్యంలో బహుముఖ సేవలు అందించారని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి కొనియాడారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో రామానుజరావు 103వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం పరిషత్తు ప్రాంగణంలో దేవులపల్లి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రముఖ సాహితీవేత్త, పత్రి కా సంపాదకుడు కే శ్రీనివాస్‌కు దేవులపల్లి పురస్కారాన్ని అందజేశారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జే చెన్నయ్య, ప్రాచ్య కళాశాల ప్రధాన ఆచార్యుడు డాక్టర్‌ సిల్మానాయక్‌, సాహితీవేత్తలు పాల్గొన్నారు.


logo