Statue Of Equality | ముచ్చింతల్లో సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు ఆరో రోజు కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమతామూర్తి కేంద్రంలో 33 స్త్రీ దేవతామూర్తల విగ్రహాలను ప్రతిష్టించారు. 108 దివ్య దేశాల్లోని 33 ఆలయాల్లో విగ్రహాలకు ప్రాణప్రతిష్టాపన జరిగింది. యాగశాల నుంచి 33 స్త్రీ దేవతామూర్తులతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తులను దివ్యదేశాలకు 33 మంది ఉపద్రష్టులు తీసుకెళ్లారు. దేవతామూర్తుల శోభాయాత్రను చినజీయర్ స్వామి పర్యవేక్షించారు.
ఇక సమతామూర్తి కేంద్రానికి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. సమతామూర్తి, 108 దివ్యదేశాల దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. యాగం, శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలను భక్తులు తిలకిస్తున్నారు. నిన్న దాదాపు 2 లక్షల మంది సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.