దాశరథి స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి : మంత్రి హరీశ్‌రావు
మంత్రి హరీశ్‌రావు | ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

సిద్దిపేట : ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి చేసుకున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో గురువారం దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
నాడు కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో నేడు పసిడి పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు.
3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు.
పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, జిల్లా లైబ్రరీని వినియోగించుకోవాలని మంత్రి కోరారు. 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఇక నుంచి ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటరన్నారు. ఇప్పటి వరకు 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు అవసరమైన సంపూర్ణ సహకారం ఆర్థిక శాఖ తరపున అందిస్తానని భరోసా ఇచ్చారు.
అంతకుముందు దాశరథి పాటలు, ఆయన రాసిన కవిత్వం వింటుంటే అమృత ధారలు కురిసిన విధంగా మంచి అనుభూతి పొందినట్లు మంత్రి చెప్పారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారని, పీడిత ప్రజల పక్షాన పోరాడినట్లు చెప్పుకొచ్చారు. దాశరథి కలలుగన్న వారి ఊహాల్ని తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాల్గొనే ఉద్యోగార్థులకై జిల్లా లైబ్రరీలో 50 కుర్చీలతో కూడిన వసతి కల్పించినట్లు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలు పెట్టాలని ఆయాచితం శ్రీధర్ కు మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

