దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
క్రైం న్యూస్ | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

మహబూబాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ అమానవీయ ఘటన నెల్లికుదురు మండలం కుంట తండాలో చోటు చేసుకుంది. స్థానికులక కథనం మేరకు.. తండాకు చెందిన గుగులోతు వీరన్నకు గత 10 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నాన్క్ (35) తో వివాహం జరిగింది. ఈ దంపతులిద్దరూ తండాలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, వీరన్న మూడు నెలలుగా హైదరాబాద్ ఉంటున్నాడు. నాన్క్ కుంట తండాలో కూలీ పని చేసుకుంటూ ఇద్దరు కుమారులతో కలిసి ఇంటి వద్దనే ఉంటున్నది. ఈ నెల 21న (బుధవారం) హైదరాబాద్ నుంచి కుంట తండాకు వచ్చిన వీరన్న భార్యతో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి భోజనం చేసి పడుకొన్నాక వీరన్న తన భార్యను కత్తితో పొడిచి చంపి అనంతరం అక్కడి నుంచి పారి పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
Regional Parties | 816కు సీట్లు పెరిగినా సంకీర్ణమే.. 2029 ఎన్నికలకల్లా జాతీయ పార్టీలు మరింత ఖల్లాస్!
KCR | కూటమి నీతితో ఓటమిని గెలిచి.. కేసీఆర్ బ్రహ్మాస్త్రం
Horoscope | 29-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

