దామెర;హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌ను ఆనుకొని ఉన్న దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ శనివారం రాత్రి లీక్ అయ్యింది. ఆదివారం ఉదయం వరకు ఎవరూ గమనించక పోవడంతో సమీపంలోని దాదాపు పది ఎకరాల పత్తి పంట నీట మునిగింది. దేవాదుల ఎత్తిపోతల పథకం అధికారులు శ్రమించి ఆదివారం మధ్యాహ్నం నీటి సరఫరాను నిలిపివేశారు.