కేంద్ర మంత్రి దృష్టికి గల్ఫ్ దేశాల్లో తప్పిపోయిన తెలంగాణవాసుల వివరాలు

హైదరాబాద్ : గల్ఫ్ దేశాల్లో తప్పిపోయిన తెలంగాణ వాసుల ఆచూకీని కనుగొని తిరిగి స్వదేశం తీసుకురావాల్సిందిగా కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ కె.ఆర్.సురేష్‌రెడ్డి నేతృత్వంలోని బృందం కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌కు విజ్ఞాపన పత్రం అందజేసింది. ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో గురువారం సాయంత్రం కలిసిన వీరు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తప్పిపోయిన వారి వివరాలను ఈ సందర్భంగా అందజేశారు.
అనేక సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా వాసులు గల్ఫ్ దేశాలకు ఉపాధికై వెళ్తున్నారు. కాగా అక్కడికి వెళ్లిన తర్వాత వారి వద్ద నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని వెతికి స్వదేశానికి రప్పించాల్సిందిగా కోరారు. సావధానంగా ప్రతి వ్యక్తి వివరాలు చదివిన మంత్రి ఆయా దేశాలలో ఉన్న ఇండియన్ ఎంబసీలకు ఆదేశాలు పంపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బృందం మంత్రితో పలు అంశాలపై చర్చించింది.
- విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి సంక్షేమానికై NRI – Welfare Board ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సబ్ కమిటీ వేసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
- విదేశాలకు ఉపాధి, ఉద్యోగానికై వెళ్ళిన మన వాళ్ళ పాస్ పోర్ట్ లు అక్కడి యజమానులు తీసుకోవడాన్ని ప్రస్తావించి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సూచన మేరకు పాస్ పోర్ట్ లు తీసుకోకుండా చూడాలని కోరారు. దీనిపై దైపాక్షిక చర్చల ద్వారా ఆయా దేశాలతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
- ఆయా దేశాలలో తప్పిపోయిన, జైళ్లలో ఉన్న వారి వివరాలపై కుటుంబ సభ్యులు, ఎన్జీవో లు పంపే ఉత్తరాలు, ఈమెయిల్ లకు కూడా ఇండియన్ ఎంబసీలు సరిగ్గా స్పందించక జవాబు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంలో ఎంబసీలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మంత్రి తన సిబ్బందిని ఆదేశించారు.
కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సురేష్ రెడ్డితో పాటు, ప్రవాస భారతీయ హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, మలేసియా తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శాంతి ప్రియ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

