మేడిపల్లి, ఏప్రిల్ 14: జగిత్యాల జిల్లా భీమారం మండలం దేశాయిపేట శివారులో విఘ్నేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితుడు ఎస్ జనార్దన్‌రెడ్డి కథనం ప్రకారం.. రైస్ మిల్లు నుంచి ఆదివారం తెల్లవారుజామున పొగలు వస్తున్నాయనే స్థానికుల సమాచారం మేరకు వచ్చి చూడగా అప్పటికే మంటలు భారీగా చెలరేగాయి.
వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే 22 వేల క్వింటాళ్ల ధాన్యం, 20 వేల ఖాళీ గన్నీ బస్తాలు కాలిబూడిదయ్యాయి. దాదాపు రూ.3.30కోట్ల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.