హైదరాబాద్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో(Purchasing centers) జాప్యం జరుగకుండా చూస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను రైతులకు ఎప్పటికప్పుడు అందజేయాలని అధికారులకు సూచించారు.
వర్ష సూచనపై రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తడిచిన ధాన్యం(Wet grain) కూడా కొంటామని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నారు. కాగా, దొడ్డు వడ్ల బోనస్ గురించి ఎన్ని సార్లు అడిగినా డిప్యూటీ సీఎం మాట మార్చి సన్న వడ్లకే బోనస్ ఇస్తామంటూ తెలిపారు.