బోనకల్లు, అక్టోబర్ 28: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టిలో పడాలనే అత్యుత్సాహంతో కొందరు పోలీసులు విధులను విస్మరిస్తున్నారని, అలా చేస్తే ఆంధ్రాలో ఐపీఎస్లకు పట్టిన గతే పడుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామంలో పార్టీ నాయకుడు ఎర్రబోయిన నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సభలో మాట్లాడారు. నాగేశ్వరరావు వర్ధంతి సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని ప్రభుత్వం తాజాగా విస్తరించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కాగజ్నగర్, కామారెడ్డి, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, శాతవాహన (కరీంనగర్), సిద్దిపేట, స్తంభాద్రి(ఖమ్మం), సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, జనగాం, నారాయణపేట, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, నల్లగొండ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిని విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. త్వరలోనే నోటిఫికేషన్ను జారీ చేయనున్నారు.